చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాది..

  • ఇష్టారాజ్యంగా ప్రజల సొమ్మును దోచేస్తున్నారు..
  • చంద్రబాబుకు సుజనాచౌదరి  బీనామి మాత్రమే..
  • అసలు లబ్ధిదారుడు చంద్రబాబే..
  • వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య
హైదరాబాద్ః చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాది అని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య అన్నారు. హైదరాబాద్‌  లోటప్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర  కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఆలీబాబా 40 దొంగలు మాదిరిగా ఆర్థిక నేరగాళ్లను వెంటబెట్టుకుని ఆషాఢభూతిగా చంద్రబాబు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. సామాన్య ప్రజానీకం కష్టపడి సంపాదించిన బ్యాంకుల్లో దాచుకుంటే అవి ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయన్నారు. అక్రమంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థను అవినీతిమయం చేస్తున్నారు. చంద్రబాబు సపోర్ట్‌తోనే విచ్చలవిడిగా ఆర్థిక నేరానికి సుజనాచౌదరి పాల్పడ్డారన్నారు. 120 షెల్‌ కంపెనీలతో సుజానా అవినీతికి పాల్పడ్డారని, డొల్ల కంపెనీలు స్పష్టించి బ్యాంకుల నుంచి కొట్టేసిన వందల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. డొల్ల కంపెనీలతో బ్యాకింగ్‌ వ్యవస్థలను నాశనం చేశారన్నారు.  2009,2014 ఎలక్షన్‌లో అధిక సొమ్ము సుజనా చౌదరి నుండే టీడీపీకి వచ్చిందన్నారు. క్విడ్‌ప్రోకోగా సుజనాకి కేబినెట్‌ పదవి ఇప్పించారన్నారు. మోసానికి పాల్పడడానికి చంద్రబాబే సుజనాను పోత్సహించారన్నారు. పార్టీకి ఆర్థికంగా సాయం చేసేవాళ్లు అవసరం అవసరమని ఆర్థిక వనరులు సమకూరుస్తున్న సుజానా చౌదరికి కేబినెట్‌ పదవి ఇవ్వడం న్యాయమే అంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యలను కోడ్‌చేశారు. సుజనాపై ముందే విచారణ చేస్తే పరిస్థితి ఇంతవరుకూ వచ్చేది కాదని అన్నారు. సుజనా  అవినీతి దందాలన్నీ చంద్రబాబుకు తెలుసు అని అన్నారు.సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్దఎత్తున్న  అవినీతి జరుగుతుందన్నారు. అగ్రిగోల్డ్‌ భూములు మంత్రి భార్య కొనుగోలు చేసినా చర్యలు శూన్యమని, స్వయంగా డాకుమెంట్ల కాపీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. విశాఖ భూ కుంభకోణంలో ఒక మంత్రి ఉంటే.. తూతూమంత్రంగా సిట్‌ వేసి క్లీన్‌చిట్‌ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. అమరావతి భూములను కారుచౌకగా టీడీపీ నేతలు కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులను సీఎం రమేష్‌ ఇవ్వడం అనైతికమన్నారు. ప్రజాసొమ్మును ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రరాష్ట్రాన్ని సొంతజాగీరుగా పెద్దబాబు,చిన్నబాబు పరిపాలిస్తున్నారన్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆస్తులన్నీ కూడబెట్టడానికి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడానికి, ఎలక్షన్లలో ఖర్చుపెట్టడానికి ఆ సొమ్ముంతా ఖర్చుపెట్టారన్నారు. చంద్రబాబుకు సుజనాచౌదరి ఒక బీనామి మాత్రమేనని అసలు లబ్ధిదారులు చంద్రబాబే అని అన్నారు. సుజనాచౌదరి మంత్రికాక ముందే ఆయనపై కేసులు ఉన్నాయన్నారు. కేసులున్నా మంత్రి పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అటువంటి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి దేశాన్ని పరిరక్షిస్తానంటున్నారని విమర్శించారు. షెల్‌ కంపెనీలతో రూ.6,800 కోట్లు కొల్లగొట్టారని ఈడీ చెప్పిందన్నారు.వడ్డీతో కలిసి 8వేల కోట్ల పైచిలుకు డబ్బు కొల్లగొట్టారన్నారు.సుజనా చౌదరి చంద్రబాబు చేతిలో ఓ పనిముట్టు లాంటివాడరన్నారు.æటీడీపీ పార్టీనీ ఎన్టీఆర్‌ ఉన్నత ఆశయంతో స్థాపించారని అలాంటి పార్టీని చంద్రబాబు భ్రష్టు పట్టించారన్నారు. సుజనాను వెంటనే రాజ్యసభ నుంచి  సెస్పెండ్‌ చేయాలని డిమాండ్‌చేశారు. ఏ మాత్రం నెట్‌వర్త్‌ లేని కంపెనీలకు బ్యాంకులు లోన్లు ఎలా ఇచ్చాయని ప్రశ్నించారు. ఇది వ్యవస్థీకృనేరంగా పేర్కొన్నారు. సంబంధింత బ్యాంక్‌ అధికారులను కూడా విచారించాలన్నారు.ఈడీలో తన మనుషులను పెట్టుకుని వైయస్‌ జగన్‌పై కుట్రకు పాల్పడ్డారు. ఈడీ భ్రష్టు పట్టిందని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరం. బ్యాంకులను మేనేజ్‌ చేసిన చ్రరిత కూడా చంద్రబాబుదే అని అన్నారు.చంద్రబాబు నేరాలు బయటపడకుండా సీబీఐ రావొద్దంటున్నారన్నారు .సిబీఐ రాకుండా జీవోలు ఇవ్వడం పిచ్చిపనిగా అభివర్ణించారు. బాబుపై విమర్శలు వచ్చినప్పుడల్లా పవన్‌కల్యాణ్‌ను వాడుతున్నారన్నారు .ప్రజల దృష్టిని మరల్చడానికే పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు పనిముట్టగా పవన్‌కల్యాణ్‌ ఉపయోగపడుతున్నారని ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
Back to Top