హత్యాయత్నం వెనుక కుట్ర దాగి ఉంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర
 
విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రపూరితంగానే హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్యే రాజన్నదొర మండిపడ్డారు. సాలూరులో పాదయాత్ర ముగించుకొని విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు వచ్చామని, లాంజ్‌లో కూర్చొని కాఫీ తాగుతుండగా హైదరాబాద్‌ వెళ్లాల్సిన విమానానికి సమయం అయిందని సిబ్బంది చెప్పడంతో బయల్దేరుతుండగా సెల్ఫీ కావాలని ఒక కు్రరాడు వచ్చి అడిగి ముందుకు వచ్చాడు. వైయస్‌ జగన్‌ కాస్త వెనక్కు జరగడంతో కత్తితో భుజంపై పొడిచాడన్నారు. పందెం కోడికి కట్టే కత్తితో పొడిచారని, ఆ కత్తికి విషం పూశారని భయంగా ఉందన్నారు. పొడిచిన వ్యక్తి నన్ను అరెస్టు చేయండి.. నన్ను ఏమీ చేయొద్దని మాట్లాడుతున్నాడని, దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్నారు. తక్షణమే సీఎం దర్యాప్తు చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 
 
Back to Top