వైయస్‌ఆర్‌సీపీ నేత కృష్ణపై హత్యాయత్నం


పశ్చిమ గోదావరి: దెందలూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్‌ అరాచకాలు కొనసాగుతున్నాయి. వైయస్‌ఆర్‌సీపీ నేత మేడికొండ కృష్ణపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలవరం కాలువపై మట్టి అక్రమ రవాణాపై కృష్ణ ఫిర్యాదు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నేత కృష్ణను చింతమనేని ఇంటికి టీడీపీ నేతలు కారులో కొట్టుకుంటూ తీసికెళ్లి రోడ్డు పక్కన పడేశారు. కృష్ణపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు. పెదవేగి పోలీసు స్టేషన్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొఠారు అబ్బాయి చౌదరి ఆందోళన చేపట్టారు. కృష్ణపై హత్యాయత్నం కేసులో చింతమనేని, టీడీపీ నేతలను అరెస్టు చేయాలని అబ్బాయి చౌదరి డిమాండు చేశారు. 
 
Back to Top