కర్నూలు: అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త అయ్యప్పపై టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ మేరకు అయ్యప్ప కోసిగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడిని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.