<strong>కనీస మద్దతు ధర ఇవ్వకుండా రూ.400 కోట్లతో బోట్ విన్యాసాలా..</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి</strong>తూర్పుగోదావరిః పట్టిసీమపై ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు ఆపాలని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.నాగార్జున,పులిచింతల నుంచి నీరే కృష్ణా డెల్టాను ఆదుకుందన్నారు.నీటమట్టం 14 మీటర్లకు తగ్గినా పట్టిసీమలో ఇంకా 18 పంపులు రన్ చేస్తున్నారన్నారు.గోదావరి డెల్టాలో రబీకి నీటి ఎద్దడి వస్తుంటే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. పంటకు కనీస మద్దతు« ధర ఇవ్వకుండా ప్రకాశం బ్యారేజీ వద్ద రూ.400 కోట్లతో బోట్ విన్యాసాలు నిర్వహించడం దారుణమన్నారు.