<strong>జననేత నాయకత్వంలోనే ముస్లింలకు న్యాయం..</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ నేత మి«ధున్ రెడ్డి</strong>శ్రీకాకుళంఃవైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కలుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత మిథున్ రెడ్డి అన్నారు.చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లలో మైనారిటీలను ఏవిధంగా దగా చేశారో ముస్లింలకు గ్రహిస్తుందన్నారు. వైయస్‌ఆర్‌సీపీలోకి మైనారిటీ నేతల వలసలు పెరుగుతున్నాయన్నారు. సీనియర్ నేతలు,ఇక్బాల్, అబ్దుల్ గని వంటివారు పార్టీలోకి చేరడం సంతోషకరమన్నారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాల పట్ల వివిధ పార్టీల నేతలు ఆకర్షితులై పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయన్నారు. మైనారిటీలందరూ వైయస్ జగన్‌తోనే మేలు జరుగుతుందని భావిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారన్నారు. గతంలో వైయస్‌ఆర్ హయాంలో ముస్లింలకు జరిగిన మేలు తలుంచుకుంటున్నారన్నారు. వైయస్‌ఆర్ లేని లోటును ఆయన తనయుడు వైయస్ జగన్ మాత్రమే భర్తీ చేయలగలరని భావిస్తున్నామన్నారు.