థర్డ్‌ పార్టీ ఎంక్వైరీకి భయమెందుకు?

న్యూఢిల్లీ: వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై థర్డ్‌ పార్టీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని తాజా మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌కు మరింత భద్రత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఘటనపై చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఎయిర్‌ పోర్టులో దాడి జరిగితే చంద్రబాబు మా పరిధిలో లేదని అంటున్నారని పదే పదే చెబుతున్నారని కేంద్ర మంత్రికి తెలిపామన్నారు. ఇదే విషయాన్ని రేపు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. రిమాండు రిపోర్టులో వైయస్‌ జగన్‌ మెడకు కత్తితో గురి పెట్టారని, ఆయన త్రుటిలో తప్పించుకోవడంతో మెడ నుంచి చేతికి గాయమైందన్నారు. ఘటన జరిగిన వెంటనే డీజీపీ మీడియాతో మాట్లాడుతూ హంతకుడు జగన్‌ అభిమాని అని విచారణ చేపట్టకుండానే ఎలా చెప్పారని నిలదీశారు. థర్డ్‌పార్టీ ఎంక్వైరీతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మిథున్‌రెడ్డి తెలిపారు.
 
Back to Top