సీబీఐ విచారణ కోరే ద‌మ్ముందా?


విశాఖపట్నం: టీడీపీ నాలుగున్నర సంవత్సరాల పాలన అక్రమాల పుట్టగా సాగిందని, చంద్ర‌బాబుకు నిజాయితీ ఉంటే సీఎం తన పాలనపై సీబీఐ విచారణ కోరే ద‌మ్ముందా అని వైయ‌స్ఆర్‌సీపీ నేత మ‌ళ్ల విజ‌య ప్ర‌సాద్‌ సవాల్‌ విసిరారు. విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరితే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సిట్‌ చేత విచారణ చేపట్టారని, కానీ సిట్‌ నిజాలు బయట పెట్టకుండా అధికార పార్టీకి అనుకూలంగా నివేదిక ఇచ్చిందని వైయ‌స్ఆర్‌ సీపీ విశాఖపట్నం నగర అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్‌ తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పటికైనా ప్రజల్ని మోసగించకుండా సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. భూకుంభకోణంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌ హస్తం ఉందని ఆరోపణలున్నాయని, కానీ సిట్‌ లోకేష్‌ పేరు తప్పించడంతో అనేక అనుమానాలు తలెత్తున్నాయని వ్యాక్యానించారు.

వైయ‌స్ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే భూకుంభకోణంపై రీ ఎంక్వైరీ వేస్తామని వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే సీఎం అవహేళన చేస్తూ మాట్లాడటం జుగుప్సాకరంగా ఉందన్నారు. 
 


Back to Top