విజయనగరంః రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్‌ను ప్రజలే కాపాడుకుంటారన్నారు. ప్రజా సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చూస్తామన్నారు. దైవానుగ్రహంతో జగన్‌కు ప్రమాదం తప్పిందన్నారు. గిరిజనుల అభివృద్ధి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు.భద్రత మరింత పెంచినట్లు తెలిపారు.మహిళలు, రైతులు, యువతతో పాటు అన్నివర్గాల ప్రజలు వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై నమ్మకం పెట్టుకున్నారన్నారు.