విజయనగరంః జిల్లా ప్రజలు వైయస్ జగన్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరుకూ 7 బహిరంగ సభలు జరిగాయని, కనీవిని ఎరుగని రీతిగా ప్రజలు జననేతకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సాలూరు బహిరంగసభకు కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారన్నారు.టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. వైయస్ జగన్‌ను సీఎం చేసుకుని మళ్లీ రాజన్న రాజ్యం చూడాలనే ఆశతో ఉన్నారన్నారు.