రెండు చరిత్రాత్మక ఘట్టాలకు విజయనగరం వేదికైంది


విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు విజయనగరం జిల్లా రెండు చరిత్రాత్మక ఘట్టాలకు వేదికగా నిలిచిందని పార్టీ సీనియర్‌ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గొర్ల మండలం ఆనందపురం వద్ద వైయస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర 3100ల మైలురాయిని దాటనుందన్నారు. ఇదే ఆనందపురం వద్ద దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన తారక రామతీర్థ ప్రాజెక్టు బ్యారేజీ కూడా ఉందని చెప్పారు. వైయస్‌ఆర్‌ మరణించిన తరువాత ప్రాజెక్టు పనులను అటకెక్కించారని, రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకొని ఆయన నాయకత్వంలో ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. 3100 ఆనందపురంలో పూర్తి చేసుకోబోవడం ఆనందంగా ఉందన్నారు. రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top