విజయవాడః చంద్రబాబు కంటికి పేదలు కనిపించడంలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత ఇక్బాల్ అన్నారు. విజయవాడలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సభలో ఆయన మాట్లాడారు.చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విహార యాత్రలు చేస్తున్నారన్నారు. రాజధాని అమరావతి పేరుతో గ్రాఫిక్‌లు చూపిస్తున్నారన్నారు.పేదల గుర్తు అయిన సైకిల్‌ను ఎన్టీఆర్ నుంచి లాక్కుని చంద్రబాబు తుప్పుపట్టించారన్నారు. సైకిల్ గుర్తును తొలగించి ప్రత్యేక విమానం గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదన్నారు. చంద్రబాబు సహకారంతో టీడీపీనేతలు ప్రజల సొమ్మును బ్యాంకుల నుంచి దోచుకుని ఆర్థిక ఉగ్రవాదులగా మారుతున్నారన్నారు.పోలవరం నుంచి అమరావతి నుంచి ముడుపుల బాగోతం సాగుతుందని, వైయస్‌ఆర్‌సీపీ ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులు అంటూ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.విద్య,వైద్య,ఆరోగ్య రంగాలను పడకేసాయన్నారు.పేదలను అవమానించిన ప్రభుత్వాన్ని మట్టి కరిపించాలన్నారు.వైయస్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.జగన్‌మోహన్‌పై హత్యాయత్నం చేయించి టీడీపీ చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.