సీబీఐకి అప్పగించడంలో భయం ఎందుకు

హర్షవర్ధన్‌ ఫిర్యాదు చేసిన తరువాతే జననేతపై హత్యాయత్నం
సాక్షాధారాలు తెరమరుగు చేసే ప్రయత్నం జరుగుతోంది
వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంలో నిస్పక్షపాత దర్యాప్తు జరగాలి
నిందితుడు పదివేల కాల్స్‌ ఎవరితో మాట్లాడాడో బయటపెట్టాలి
అబద్ధాలు మాట్లాడుతూ విచారణ అధికారులను ప్రభావితం చేస్తున్నారు
సీఎం చంద్రబాబుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయబోతున్నాం
హైదరాబాద్‌: ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై నిస్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మహ్మద్‌ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు. హత్యాయత్నంలో చంద్రబాబు హస్తం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేసు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహ్మద్‌ ఇక్బాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ఎప్పుడైనా బయట నుంచి కాఫీ తెప్పించుకుంటారని, ఫ్యూజన్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరి ఎయిర్‌పోర్టు నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడని, రెండుసార్లు ఫ్యూజన్‌ రెస్టారెంట్‌ నుంచి కాఫీ వచ్చిందని, మూడోసారి అదును చూసి జననేతపై అటాక్‌ చేయించారన్నారు. నిందితుడు శ్రీనివాసరావు రెండు కత్తులతో దాడి చేయాలని ప్రీ ప్లాన్డ్‌గా వచ్చాడని రిమాండ్‌ రిపోర్టులో క్లీయర్‌గా ఉన్నా.. చంద్రబాబు ఎందుకు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌పై కుడి చేతితో ఒక కత్తి పట్టుకొని దాడి చేయడం.. అతని ప్యాంట్‌ ఎడమ జేబులో మరో పదునైనా ఆయుధం ఉందని తేలిందన్నారు. 

నిందితుడు శ్రీనివాసరావు రెండు సిమ్‌ కార్డులు, తొమ్మిది ఫోన్లు మార్చి పది వేల ఫోన్‌ కాల్స్‌ మాట్లాడడని,  ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి పది నిమిషాల్లో వైయస్‌ జగన్‌ను హత్య చేయబోతున్నానని, టీవీ చూడాలని చెప్పాడని విచారణలో తేలిందన్నారు. ఎప్పుడు ఇంట్లో డబ్బులు ఇవ్వని వాడు ఠానేలంకలో స్నే హితులకు పెద్ద విందు, ఇంట్లో డబ్బులు ఇవ్వడం చూస్తుంటే మావాడితో ఎవరో చేయించారని నిందితుడి అక్క చెబుతుందన్నారు. ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరి నేర చరిత్ర ఉన్నా నిందితుడు శ్రీనివాసరావును క్లీయరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకొచ్చి పెట్టుకున్నాడన్నారు. పని మానేస్తానని చెప్పినా గడ్డం పట్టుకొని ఎక్కవ డబ్బులిచ్చి మళ్లీ పనిలో పెట్టుకున్నాడన్నారు. హర్షవర్ధన్‌ప్రసాద్‌ చౌదరి ఇంత తతంగం నడిపినా అతన్ని లోతుగా విచారించేందుకు ప్రయత్నం చేయకపోవడం ఏంటని నిలదీశారు. 

హర్షవర్ధన్‌ ప్రసాద్‌చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి గాజువాక టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నాడని, నారా చంద్రబాబు, లోకేష్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయని బయటపడ్డాయన్నారు. వారి అండతోనే ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పోటీ చేశాడని, అసోసియేషన్‌ బిల్డింగ్‌లో హర్షవర్ధన్‌ చౌదరికి ఒక రూమ్‌ కూడా కేటాయించారన్నారు. స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించే సౌకర్యాలు కూడా అతనికి కల్పించారని తెలుస్తోందన్నారు. అలాంటి వ్యక్తిని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు.

శ్రీనివాసరావు పదివేల కాల్స్‌ ఎవరితో మాట్లాడారు.. శ్రీనివాసరావు, హర్షవర్ధన్‌చౌదరిలతో టీడీపీ నేతలు ఎవరెవరు మాట్లాడారో తేల్చాలని మహ్మద్‌ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఊహించినట్లే జరుగుతుందని, నిందితుడు శ్రీనివాసరావు మానసిక పరిస్థితి బాగులేదని బెయిల్‌కు అప్లయ్‌ చేస్తున్నారన్నారు. ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నాన్ని చంద్రబాబు కోడి కత్తి అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని, డీజీపీ ఒక ఫ్లెక్సీ, మడత కూడా లేని ముగ్గురి దస్తూరితో ఉన్న లెటర్‌ సృష్టించి తప్పుదోవ పట్టించాలని చూశారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ మొదటి నుంచి నిస్పక్షపాత దర్యాప్తు జరగాలని కోరుతుందన్నారు. మొత్తం సాక్షాలన్నింటినీ తెరమరుగు చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని, థర్డ్‌ పార్టీ, సెంట్రల్‌ ఏజెన్సీల దర్యాప్తుకు కేసు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై విచారణ చేపడుతున్న అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్రిమినల్‌ కేసు పెట్టబోతున్నామని మహ్మద్‌ ఇక్బాల్‌ చెప్పారు. దర్యాప్తు జరగనివ్వకుండా చంద్రబాబు తప్పుదోవపట్టిస్తూ జడ్జిమెంట్‌ ఇస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. హోంమంత్రి కూడా తేలికైన అంశం కొట్టిపారేయడానికి చూస్తున్నారని, టీడీపీ నేతల మాటలు ప్రభావితం చేసి, విచారణ తప్పుదోవ పట్టే ప్రమాదముందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు కేసు అప్పగించేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సీబీఐకి అప్పగిస్తే ఎవరి డ్రామా, ఎవరు చేపించారనేది బయటపడుతుందన్నారు. హత్యాయత్నంలో మీ హస్తం లేకపోతే ఎందుకు సీబీఐకి లెటర్‌ ఇవ్వడానికి జంకుతున్నారని చంద్రబాబును నిలదీశారు. ఫేస్‌బుక్‌పై సుప్రీం కోర్టు డైరెక్షన్‌ ఉన్నా తొమ్మిది మంది వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టారని, హత్యాయత్నం కేసును తప్పుదోవపట్టిస్తున్న చంద్రబాబుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయబోతున్నామన్నారు. 
Back to Top