బాధితులకు అండగా ఉంటాం అఘాయిత్యాలు వద్దూ..

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే న్యాయం జరుగుతుంది
అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయాలని చంద్రబాబు పన్నాగం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత లేళ్ల అప్పిరెడ్డి
విజయవాడ: స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇంత పెద్ద కుంభకోణం ఎప్పుడు జరగలేదని అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్, వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. హాయ్‌లాండ్‌ అగ్రిగోల్డ్‌ ఆస్తులకు సంబంధించిందేనని, ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థకు చైర్మన్‌గా ఉన్న అవ్వారు వెంకటరామరావు ప్రకటించారని చెప్పారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో బాధితులు 19 లక్షల మంది ఉన్నారని, బాధితులకు రూ. 6,800 కోట్లు చెల్లించాలని, ఆస్తులు రూ. 35 వేల పైచిలుకు ఉన్నాయని ప్ర భుత్వం ప్రకటించిందన్నారు. దాని తరువాత న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్‌ఎల్‌ గ్రూపు ముందు వచ్చిందన్నారు. 2018 ఏప్రిల్‌ 3వ తేదీన ఢిల్లీ ఆంధ్రభవన్‌లో చంద్రబాబును కలిసిన ఎస్‌ఎల్‌ గ్రూపు ప్రతినిధులు అకస్మాత్తుగా తిరిగి వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేదని కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారన్నారు. 

హాయ్‌లాండ్‌ కొట్టేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అప్పిరెడ్డి మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా ఏనాడూ కూడా హాయ్‌లాండ్‌కు సంబంధించిన అంశాన్ని సీబీసీఐడీ, ప్రభుత్వం ఎత్తలేదని, కొత్తగా ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆగ్రిగోల్డ్‌ ఆస్తులను దోచుకోవాలని చూస్తున్నారన్నారు. బాధితుల పక్షాన పోరాటం చేయడానికి వైయసార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకు సుమారు 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, బాధితులెవరూ అధైర్యపడొద్దని, అఘాయిత్యాలు చేసుకోవద్దని చెప్పారు. బాధితులందరికీ వైయస్‌ జగన్‌ అండగా ఉంటారన్నారు. 
Back to Top