చంద్ర‌బాబు రాజ‌కీయ హంత‌కుడు


- ఎన్‌టీఆర్‌ చనిపోవడానికి చంద్రబాబే కార‌కుడు
- .వెన్నుపోటు గురించి తెలియాలంటే ఎన్టీఆర్ ప‌క్క‌నే చంద్రబాబు విగ్రహం కూడా పెట్టాలి.
- సుహాసిని ట్వీట్ చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. ఆమెని బలిపశువు చేశారు.
విజయవాడ: స‌్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావును రాజ‌కీయంగా హ‌త్య చేసిన హంత‌కుడు చంద్ర‌బాబు నాయుడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి పేర్కొన్నారు. బరోడాలో ఉన్న బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి నందమూరి తారక రామారావుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని స్టే ఆర్డర్‌ తీసుకురావడంతో  చంద్రబాబు చేసిన అవమానం తట్టుకోలేక గుండె ఆగిపోయిన సంఘటన అందరికీ తెలుసు అన్నారు. ఇన్నీ ద్రోహాలు చేసిన చంద్రబాబు రాజకీయ హంతకుడని అభివర్ణించారు. ఎన్‌టీఆర్‌ను రాజకీయంగా, మనోవ్యధతో చంపావని అక్రోశం వెల్లగక్కారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పేందుకు స్థాపించిన తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడిని నిలువునా కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి ఎన్‌టీఆర్‌కు విగ్రహం ఏర్పాటు చేయలేని చంద్రబాబు మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని రూ.400 కోట్లతో విగ్రహం ఏర్పాటు చేస్తావంటే ఎవరు నమ్మరని పేర్కొన్నారు. గురువారం విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ల‌క్ష్మీపార్వ‌తి ఏమ‌న్నారంటే..

- అమరావతి లో ఎక్కడా చంద్రబాబు చెప్పే అభివృద్ధి కనిపించలేదు.
- నీరుకొండ లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం అంటున్నారు, అంతా గ్రాఫిక్స్.
- ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ గుర్తువచ్చారు, ఎన్టీఆర్ పేరు పెట్టిన ఒక్క పధకం అయినా సక్రమంగా అమలు జరుగుతుందా.
-ఎన్టీఆర్ పేరు పెట్టి ఎందుకిలా వ్యవహరిస్తున్నావ్ చంద్రబాబు.
- ఇన్నీ అబద్దాలు చెప్తున్న చంద్రబాబు పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కించాలి అని వారికి లెటర్ రాయాలి అనుకుంటున్నా.
- చంద్రబాబు నువ్వు ఎన్టీఆర్ కి భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయావ్, ప్రతి అసెంబ్లీలో, మహానాడులో తీర్మానం చేస్తావ్ కదా.
- చంద్రబాబు నువ్వు రాజకీయ హంతకుడివి, నువ్వు కోట్లు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడమా.
- ఎన్టీఆర్ ని పదవి నుంచి దించిన వ్యక్తివి నువ్వు.
-ఎన్టీఆర్ ను పార్టీ అధ్యక్ష పదవినుంచి తొలగిస్తున్నామని బసంత్ టాకిస్ లో తీర్మానం చేశారు.
-వ్యవస్దాపక అధ్యక్షుడు చనిపోవడానికి కారకుడు చంద్రబాబు.
-ఎన్టీఆర్ పధకాలను ఎత్తివేశావు.ఆయనకు ద్రోహం చేశావు.
- నాకు వాజ్ పేయ్ స్వయంగా చెప్పారు...మీ అల్లుడే భారతరత్నకి అడ్డు తగులుతున్నారు అన్నారు
-.ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని అందరికి తెలియాలంటే పక్కనే చంద్రబాబు విగ్రహం కూడా పెట్టాలి.
-కాంగ్రెస్ కాళ్ల ముందు సాగిలబడి ఎన్టీఆర్ ఆత్మను క్షోభించేలా చేశావు.
- నీవు ఇచ్చిన 600 హామీలు నెరవేర్చగలిగావా?
-ఎన్నికలముందు నిరుద్యోగ భృతి ఇచ్చావు.
-నీవు చెప్పిన అబద్దాలు లక్ష దాటి పోయాయి.నిన్ను ఎవ్వరూ నమ్మలేని విధంగా తయారయ్యావు.
-ప్రజలు కష్టాల తీర్చిగలిగిన నేతలంటే ఎన్టీఆర్ ,వైయస్ రాజశేఖరరెడ్డిలను ప్రజలు గుర్తుకుతెచ్చుకుంటారు.
-రేపు జరిగే ఎన్నికలలో కూడా చంద్రబాబు ఓడిపోతే తప్ప తెలుగువాడి ఆత్మగౌరవం నిలబడదు అని ప్రజలు భావిస్తున్నారు.
- వైయస్ జగన్ పాదయాత్రలో ప్రతిపేదవాడు కలసి టిడిపి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతుందని మొర పెట్టుకుంటున్నారు.
-వైయస్ రాజశేఖరరెడ్డి పాలన రావలంటే  వైయస్ జగన్ ను అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
-లోకేష్ అవినీతిలో ఆరితేరిపోయాడు.భువనేశ్వరి ధనవంతుల జాబితాలోకి చేరిపోయింది.
-అధికారం డబ్బు అనే పదాలు తప్ప చంద్రబాబు డిక్షనరీలో ప్రజాపరిపాలన అనేది లేదు.
-60 అడుగుల విగ్రహాన్ని పెడదామనే వాగ్దానాన్ని ఎన్నికలముందు ప్రజలను మబ్యపుచ్చడానికి చంద్రబాబు చేశారు.
-వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారకుడైన వ్యక్తి,ఎన్టీఆర్  విగ్రహం పెడతామని చెప్పడం విడ్డూరంగా ఉంది.
- చంద్రబాబు కి అధికారం, డబ్బు రెండూ చాలు, బాబు డిక్ష‌న‌రీలో ఇవే ఉన్నాయ్.
- అప్పట్లో నన్ను బూచిగా చూపించి అందరిని వాడుకున్నారు, హరికృష్ణ చనిపోయే ముందు కూడా చాలా బాధపడ్డారు.
- నందమూరి సుహాసిని ఇంట్లో ఉన్న ఆమెని తీసుకొచ్చి ఎన్నికల బరిలో దింపారు.
- చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని కరివేపాకు లా వాడుకుంటున్నారు అని అర్థం అయి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉన్నారు.
- సుహాసిని ట్వీట్ చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి, ఆమెని బలిపశువు చేశారు.
-గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఇదే చెప్పా.చంద్రబాబు అతనిని వాడుకుని వదిలేశారు.
- నేను రాసిన ఎదురులేని మనిషి పుస్తకం ఆధారంగా రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నారు, ఎన్టీఆర్ గురించి ఎవరికి తెలియని వాస్తవాలు అందులో రాసా. 
 

తాజా వీడియోలు

Back to Top