ఎన్‌టీ రామారావు బొమ్మ ఎందుకు పెట్టుకున్నారు?


హైదరాబాద్‌: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీ రామారావును పార్టీ నుంచి బయటకు పంపించిన చంద్రబాబు, ఇప్పుడు ఆయన ఫొటో ఎందుకు పెట్టుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. పిల్లనిచ్చిన మామపై పోటీ చేస్తానని నాడు ఇందిరాగాంధీ వద్ద చంద్రబాబు ఉత్తర కుమార ప్రగాల్భాలు పలికారని అన్నారు. ఏదో పార్టీలో ఉన్న వ్యక్తి టీడీపీకిలోకి రావడమే కాకుండా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచారన్నారు.  పార్టీ అధ్యక్షుడినే చంద్రబాబుకు బయటకు పంపించారని విమర్శించారు. ఓట్ల కోసం ఎన్‌టీ రామారావు విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top