విజయనగరం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలివైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామివిజయనగరంః ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌సీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. స్మార్ట్ సిటీగా చేస్తానని మురికి కూపంగా మార్చేశారని దుయ్యబట్టారు. డెంగ్యూ విషజ్వరాలు విజృంభించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తూర్పారబట్టారు. జగన్ పాదయాత్రలో టీడీపీ చీప్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. నాలుగేళ్లలో విజయనగరం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో అవినీతి, అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం టీడీపీ ప్రభుత్వానికి పట్టలేదన్నారు. వెనుకబడిన విజయనగరం జిల్లాలో అభివృద్ధి కానరావడం లేదన్నారు. దోపిడీయే పరమార్థంగా టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరుకూ పెచ్చురిల్లుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జననేత వైయస్ జగన్‌కే పట్టం కడతారన్నారు.