చిత్తూరు: చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మరేడుపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాణిపాకంకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విద్యాసాగర్ రెడ్డి దుర్మరణం చెందారు. విద్యాసాగర్‌రెడ్డి ఆయన తల్లి ధనమ్మ, భార్య, ఇద్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయల్దేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ్మ అక్కడికక్కడే మరణించగా, మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో రాయవేలూరు ఆస్పత్రికి తరలించారు.