ఓట్ల జాబితా అంతా తప్పుల తడకే


 అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాను తప్పుల తడకగా రూపొందించిందని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. సెప్టెంబర్‌ 1, 2018న విడుదల చేసిన ఓటరు జాబితాలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయని ఆయన మంగళవారం పవర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  భర్త స్థానంలో భార్య పేరు మార్చడం, ఇంటి నెంబర్లు వేరు వేరుగా నమోదు చేసి నకిలీ ఓట్లు సృష్టించారని విమర్శించారు. ఒక బూత్‌లో 293 నకిలీ ఓట్లు ఉన్నట్లు వివరించారు. కోటేశ్వరమ్మ ఆవుల ఆమె భర్త పేరు వెంకటేశ్వర్లు ఉంటే ఇంటి పేర్లు మార్చి వేరే బూత్‌లో నమోదు చేశారన్నారు. సత్తనపల్లి నియోజకవర్గానికి చెందిన ఓట్లు మరో నియోజకరవర్గంలో నమోదు చేశారన్నారు. ఇలా రాష్ట్రంలో 2.66 లక్షల ఓట్లు ఒకే పేరుతో రెండు ఓట్లు ఉన్నాయన్నారు. ఏదో ఒక తప్పు ఉన్న ఓటర్‌ను తొలగించి అర్హులకు అన్యాయం చేశారన్నారు. ఇలా 25 లక్షల ఓట్లు తప్పుడు తడకలుగా నమోదు చేశారన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు ఉండాలి..అయితే రాష్ట్రంలో ఏడాదికే ఓటు హక్కు ఇచ్చారని వివరించారు. ఐదేళ్ల వయసు ఉన్న వారిపేర్లు ఓటరు జాబితాలో చేర్చారన్నారు. వీరు రేపు నామినేషన్‌ వేస్తే అధికారులు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో 352 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లను జాబితాలో చేర్చి తప్పుల తడకగా నమోదు చేశారన్నారు. ఒకే ఓటర్‌ ఐడితో ఏపీ, తెలంగాణలో ఓట్లు ఉన్నాయన్నారు. భర్తలు, భార్యలు, తల్లిదండ్రుల పేరుతో వేరు వేరుగా ఓటరు నమోదు జరిగిందన్నారు. ఇలాంటి జాబితాతో ఎన్నికలకు వెళ్తే ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. తప్పుడు తడకగా నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top