కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బనగానపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డిని పోలీసులు అరెçస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి ర్యాలీ నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేశారు. రెండు రోజుల క్రితం వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డి సోదరులు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ బీసీ జనార్ధన్‌రెడ్డి సోదరులపై కాటసాని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలను వదిలేసి ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంపై వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.