ప్రజలే వైయస్‌ జగన్‌ కుటుంబం

కష్టపడే నాయకుడు దొరకడం ప్రజల అదృష్టం
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి
నెల్లూరుః పట్టుదలతో ప్రజలే తన కుటుంబంగా భావించి,ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేసే జననేత వైయస్‌ జగన్‌ నాయకత్వం దొరకడం ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసిన సందర్భంగా అభినందనలు తెలిపారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతో పాటు, జగనన్నకు అవకాశం కల్పించాలన్న  లక్ష్యంతో  ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ గెలుపు కోసం బూత్‌కమిటీ సభ్యులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Back to Top