ఇది గార‌డీ ప్ర‌భుత్వం

తమ్ముళ్లపై  వైఎస్సార్సీపీ నేతల ఫైర్..!

హైద‌రాబాద్‌: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు  ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ప్రారంభించిన ప్రాజెక్ట్ ల ఫలితాలను టీడీపీ తమవిగా ప్రచారం చేసుకుంటోందని వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. మోసపూరిత ప్రకటనలతో మాయల గారడీ ప్రభుత్వం ప్రజలను పాలిస్తోందని, దానికి నాయకుడు మహామాంత్రికుడని నెహ్రూ ధ్వజమెత్తారు. నిన్న గోదావ‌రి నుంచి నీటిని కృష్ణా న‌దికి తీసుకొని వ‌చ్చామ‌ని చేసుకొన్న ప్ర‌చారం అంతా డొల్ల అని ఆయ‌న తేల్చారు. హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

కృష్ణా,గోదావరి నధుల అనుసంధానం ఎప్పుడో జరిగినా...అది తామే చేశామన్నట్లు టీడీపీనేతలు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపాలని..రైతాంగానికి ఎగనామం పెట్టే ప్రయత్నం చేయవద్దని నెహ్రూ చంద్రబాబు సర్కార్ కు హితవు పలికారు. 
Back to Top