<br/><strong>– వైయస్‌ఆర్‌సీపీని అణగదొక్కించేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు</strong><strong>– పోలీసులతో మమ్మల్ని భయపెట్టించాలని చూస్తున్నారు</strong><strong>– వైయస్ జగన్‌పై హత్యాయత్నం కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదు</strong> గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి శిష్యులమని, అక్రమ కేసులకు భయపడబోమని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు జోగి రమేష్ పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు జోగి రమేషన్‌ను గుంటూరు అరండల్ పేట పోలీసు స్టేషన్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఉదయం నుంచి సుమారు 5.30 గంటల పాటు తనను పోలీసులు విచారించారన్నారు. ఈ విచారణ దేనికి పనికి రాదని తెలిపారు. మా మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచన, దుర్భిద్ది మానుకోని, రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అయిన వైయస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఇంతవరకు కూడా సరైన విచారణ చేపట్టలేకపోయారని మండ్డిపడ్డారు. దోషులను పట్టుకోలేకపోయారన్నారు. హత్యాయత్నం చేసిన శ్రీనివాసులు వెనుక ఉన్న సూత్రదారులు ఎవరో గుర్తించలేకపోయారన్నారు. తాను ఒక మీడియా సమావేశంలో ఆ శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తగా ఉన్నాడని సోషల్ మీడియాలో ఉన్నాడని పేర్కొంటే తనను ఐదు గంటల పాటు విచారించారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేయాలన్న టీడీపీ తాపత్రయం చూస్తే బాధనిపిస్తుందన్నారు. మేం రాజశేఖరరెడ్డి శిష్యులుగా రాజకీయాల్లోకి వచ్చామన్నారు. మడమ తిప్పం..మాట తిప్పమన్నారు. ఆ రోజు వైయస్ జగన్‌పై హత్యాయత్నం చేస్తే..చంద్రబాబు మీడియాతో అవహేళనగా మాట్లాడిన బాషాను ప్రజలు మరిచిపోరన్నారు. కోడి కత్తి అని హేళనగా మాట్లాడారని తప్పుపట్టారు. వైయస్ జగన్‌ను కైమాకైమా చేస్తామని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారని, మరోక మంత్రి సోమిరెడ్డి మేం స్పాట్ పెడితే బతకడని వ్యాఖ్యలు చేస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మరొకరు వైయస్ జగన్‌పై హత్యాయత్నం చేయించింది వైయస్ విజయమ్మ, షర్మిలమ్మ అంటూ కారు కూతలు కూశారన్నారు. అసలు టీడీపీ నేతలకు మానవత్వం ఉందా? మనుషులేనా అని ప్రశ్నించారు. ఒక పశువుల్లాగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ ఇబ్రహీంపట్నంలో నరకాసుర వధ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏపీలో అరాచకాలు జరుగబోతున్నాయని స్కేచ్ వేసి చూపించిన పెయిడ్ ఆర్టీస్టును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఐదు నెలల్లో చంద్రబాబును ఓటు అనే అయుధంతో తరిమికొడతారని హెచ్చరించారు.