టీడీపీకి ఓట్లు కాదు..లెంపకాయలెస్తారు


– చంద్రబాబును మహిళలు ఛీ కొడుతున్నారు
– ఎన్నికలకు ముందు మహిళలకు ఎన్నో వాగ్ధానాలు చేశారు
– డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని మోసం

విజయవాడ:  ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని టీడీపీ నేతలకు అక్కచెల్లెమ్మలు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయరని, ఒక్కొక్కరు పది లెంపకాయలు వేస్తారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ హెచ్చరించారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఛీ కొడుతున్నారని చంద్రబాబు గ్రహించారు కాబట్టి ‘‘నేను ఓడిపోతే ’’ అంటూ చంద్రబాబు ఓటమిని అంగీకరించారని, ఆయన ఓడిపోయినట్లు తెలిసిపోయిందన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అంత తెలివి తక్కువ వారా చంద్రబాబు అని ప్రశ్నించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు.  ఎన్నికలకు ముందు చంద్రబాబు ..డ్వాక్రా రుణాలన్నీ బేషరత్తుగా మాఫీ చేస్తామని చెప్పిన వ్యక్తి..పాదయాత్ర చేస్తూ ఆరోజు ఏం చెప్పారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామన్న వ్యక్తి..సీఎం అయ్యాక ఏడాది తరువాత డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తామని నమ్మబలికి, మోసం చేశారన్నారు. ఆ డబ్బులు పడలేదని మహిళలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఈ రోజు వాళ్లను మళ్లీ మోసం చే సేందుకు, మభ్యపెట్టేందుకు పసుపు, కుంకుమ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. నిన్ను గద్దె దించడమే ఏపీ మహిళలు కంకణం కట్టుకున్నారని చెప్పారు. రైతులను కూడా రుణమాఫీ పేరుతో మోసం చేశారని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని దగా చేశారని, వాళ్ల అబ్బాయి నారా లోకేష్‌ను దొడ్డిదారిని మంత్రి పదవి ఇచ్చారని మండిపడుతున్నారని చెప్పారు. బాబు చెప్పిన మాటలు, చేసిన మోసాలు ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికి నాలుగేళ్ల పాటు మోసం చేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు చేతిలో అందరూ మోసపోయారని తెలిపారు. అవినీతిబాగోతం బయటపడుతుందని, ఐటీ దాడులు జరుగుతుంటే పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక్కొ అక్కచెల్లెమ్మ పది ఓట్లు వేయించాలా? నీకు ఒక్కోక్క మహిళల పది లెంపకాయలు వేస్తారని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మోసానికి అక్కచెల్లెమ్మలు లెంపకాయలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top