భూ కుంభకోణంపై సిట్‌విచారణలో ఏం తేల్చారు

 


విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణలో ఏం తేల్చారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. దోషులను ప్రభుత్వమే కాపాడటం దారుణమని ఆయన మండిపడ్డారు. మంగళవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో అమర్‌నా£Š   మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ కుంభకోణాలు అధికమయ్యాయన్నారు. విశాఖ పట్నంలో విలువైన స్థలాలను ఓ మంత్రి కబ్జా చేసి బ్యాంకు లోన్‌ తీసుకున్నారని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. స్వయనా ముఖ్యమంత్రి చంద్రబాబే ఓటుకు నోట్లు కేసులో ఓ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ రెడ్‌ హ్యాండేడ్‌గా దొరికిపోయారని, ఆయన బాటలోనే టీడీపీ నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఇంత పెద్ద భూస్కాం విశాఖ చరిత్రలో జరిగితే..దానిపై సిట్‌ అనే విచారణ వేసి టీడీపీ నేతలు తప్పించుకుని తిరుగుతున్నారన్నారు.  సిట్‌ విచారణ ఏర్పాటు చేసి దాదాపు ఆరు నెలలు గడుపు పూర్తి అయిపోయిందని, సిట్‌ అధికారులు ఇక్కడే తిష్ట వేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. దాదాపు 3 వేల కేసులు వేస్తే..ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అధికారులపై, ప్రజాప్రతినిధులను ఇంతవరకు ప్రశ్నించలేదన్నారు. దసపల్లా భూ ఆక్రమణలు, బీమిలి నియోజకవర్గంలోని భూ కుంభకోణం, పెందుర్తి నియోజకవర్గంలోని మెట్ట భూముల విషయంలో ఏం చేశారని నిలదీశారు. ఆ రోజు వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులపై ఈ తప్పులు నెట్టేయాలని ప్రయత్నించారన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1996 నుంచి భూ దందాలపై విచారణకు మేం సిద్ధమని చెప్పామన్నారు. 2016 నవంబర్‌ 8న దేశంలో ప్రధాన మంత్రి నోట్ల రద్దు చేస్తే..ఎక్కడ లేని డబ్బు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు ఎలా వచ్చిందన్నారు. ఇన్ని వేల కోట్లు టీడీపీ నేతలు ఎలా సంపాదించారో అని అనుమానం వ్యక్తం చేశారు. టీటీడీ సభ్యుడి వద్ద నోట్లు రద్దు అయిన నెల రోజుల్లోనే కొత్త డబ్బు కోట్లలో వచ్చిందన్నారు. ఓ మంత్రి తీసుకున్న రూ.176 కోట్లపై విచారణ చేపట్టారా అన్నారు.   ఇప్పటికైనా సిట్‌ విచారణను వేగవంతం చేసి భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు.
 
Back to Top