శ్రీకాకుళంః ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మంట గలిపిన టీడీపీ ప్రభుత్వంపై వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రను ప్రజలు ఒక యద్ధంలా భావిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.వైయస్ జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారన్నారు. అరాచక టీడీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న జననేతకు శ్రీకాకుళం ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. ప్రజలందరూ వైయస్ జగన్‌తో అడుగుల్లో అడుగేస్తూ చేయూతనిస్తున్నారన్నారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడబోతున్నారన్నారు శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు.<strong>చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యంఃతమ్మినేని సీతారాం</strong>దివంగత మహానేత వైయస్‌ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధి పట్ల వ్యత్యాసాన్ని ప్రజలు చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు.ప్రజలు టీడీపీ పాలనలో పూర్తిగా నిరాశకు గురయ్యారన్నారు. రాష్ట్రం స్వర్ణయుగం కావాలంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగనే ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారన్నారు. అందుకే వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తుందన్నారు. <br/>