రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యంకాకినాడ‌:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న మ‌ళ్లీ రావాలంటే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే సాధ్య‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ కాకినాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి చలమశెట్టి సునీల్  అన్నారు. సూరంపాలెం గ్రామంలో టీడీపీకి చెందిన ప‌లు కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా సునీల్  మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజాసంక్షేమ అభివృద్ధిని విస్మరించడంతోనే ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీ లోకి చేరుతున్నారని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు జీవన భృతి ఇస్తామని నేటికీ అమలుచేయకపోవడం శోచనీయమన్నారు.  వైయ‌స్ జ‌గ‌న్‌ నిర్వహిస్తున్న పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన వారిని అధికారపార్టీ ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకుందని ప్రత్తిపాడు కో ఆర్డినేటర్‌ పర్వత ప్రసాద్‌ అన్నారు. సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి దోచుకునే పనులకే ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్,  నాయకులు కంపర రమేష్, వరసాల ప్రసాద్, చలగళ్ల దొరబాబు, పెనుగంటి రాజేష్, మురారి రవికుమార్, బంటు వాసు, అడబాల పెదబాబు, తోట చినబాబు, దోని దొరబాబు, కాపరపు వరప్రసాద్, బత్తిన సత్యనారాయణ, కోడిగుడ్ల శ్రీను, ప్రగడరెడ్డి వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.


Back to Top