`కేశ‌వ‌రెడ్డి` బాధితుల‌ను క‌లిసిన బొత్స‌

నంద్యాల: కేశ‌వ‌రెడ్డి విద్యా సంస్థ‌ల బాధితుల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు క‌లిశారు. వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఎమ్మెల్సీ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు నంద్యాల అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి నివాసంలో బాధితుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కేశ‌వ‌రెడ్డి విద్యా సంస్థ‌ల బాధితుల‌కు న్యాయం జ‌రిగే విధంగా పార్టీ అండ‌గా ఉంటుంద‌న్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ బాధితుల ప‌క్షాన నిల‌వ‌కుండా యాజ‌మాన్యంతో కుమ్మ‌కైంద‌న్నారు.

తాజా ఫోటోలు

Back to Top