టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ..

  • చంద్రబాబు అరాచక పాలన సాగనపుదాం..
  • వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ 
అనకాపల్లిః డొల్ల కంపెనీలు స్పష్టించి.. బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి వ్యవహారంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ  అన్నారు. అనకాపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుజనా చౌదరి ఆర్థిక నేరాన్ని ఈడీ బయటపెట్టిందన్నారు. చంద్రబాబు బ్యాకింగ్‌ వ్యవస్థలను నాశనం చేస్తున్నారన్నారు. సుజనా వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ కూడా సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు.టీడీపీని సమర్థించిన పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. అధికార పార్టీ దోపిడీని  ఎందుకు పవన్‌కల్యాణ్‌  ప్రశ్నించరు అని మండిపడ్డారు. అవసరమైనప్పుడు టీడీపీని కాపాడేందుకు పవన్‌ ముందుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అని రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు నేడు 20వేల కోట్ల ఆస్తులను ఏవిధంగా సంపాదించారని  ప్రశ్నించారు. విశాఖలో భూ దందాలు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. జనవరిలోనే సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు సంసిద్ధులై ఉండాలన్నారు. చంద్రబాబు అరాచక పాలనను సాగనంపేందుకు అందరం కృషి చేయాలన్నారు.
Back to Top