వైయస్‌ఆర్ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తోందికాంగ్రెస్తో టీడీపీ అబద్ధపు కలయికహాయ్లాండ్పై తండ్రి,కొడుకుల కన్నుటీడీపీ పాలనలో విచ్చలవిడిగా ప్రజాధనం దుర్వినియోగం..చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ ఫైర్<strong>హైదరాబాద్ః</strong> వైయస్‌ఆర్ సీపీ 2019లో ఒంటరిగానే పోటీ చేస్తుందని వైయస్‌ఆర్ సీపీనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, వైయస్‌ఆర్‌సీపీ కలిసిపోయారని బాబు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీతో పొత్తని కూడా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేసే విచ్ఛిన్నకర శక్తిగా అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. సిబీఐని రాష్ట్రంలోకి రావొద్దని రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సంకేతాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తూ దోపిడీ,అవినీతి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ అవినీతి, దోపిడీ ఎక్కడ బట్టబయలు అవుతాయా అని చంద్రబాబు భయపడుతున్నారన్నారు. బద్ధౖ వెర్యం ఉన్న కాంగ్రెస్‌తో టీడీపీది అబద్ద కలయిక అని అభివర్ణించారు. రాష్ట కాంగ్రెస్ జూన్ 8న చంద్రబాబు దోపిడీపై అవినీతి, రాష్ట్ర సంపదను ఎలా దోచుకుతింటున్నారో చార్జీషీటు విడుదల చేసిందని ఈ విషయం కాంగ్రెస్ జాతీయపార్టీ నాయకులకు తెలియదా.. అని ప్రశ్నించారు. మరి మోసగారి చంద్రబాబుతో ఎలా జతకట్టుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. వ్యవస్థలను నాశనం చేయడంలో చంద్రబాబు అరితేరిపోయారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పనిచేసిన నీతి,నిజాయతీ కలిగిన ఇద్దరు సీఎస్‌లు చంద్రబాబు అవినీతి,దోపిడీలపై చెప్పడంపై ప్రజలు ఆలోచించాలన్నారు. కేంద్రం ఇచ్చిన ఉపాధిహామీ నిధులు 20వేల కోట్ల రూపాయాలలో కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దోచుకుతిన్నారన్నారు. తమ పచ్చ మీడియా సంస్థకు ఏడు వందల కోట్ల రూపాయాలు ఈ నాలుగు సంవత్సరాల్లో బిల్లు ఇచ్చారన్నారు. రూ. 450 కోట్ల భూమిని 45 లక్షలకే అప్పనంగా ఇచ్చారన్నారు. విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలన రాష్ట్రంలో ఏ రకమైన దోపిడీ జరుగుతుందో రాష్ట్ర ప్రజలు గ్రహించాలన్నారు. డబ్బు సంచులను తెచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారన్నారు. 16 లక్షల బా«ధితులు ఉన్న అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే ఆ సంస్థ ఆస్తులపై చంద్రబాబు,లోకేష్‌ల కన్నుపడిందన్నారు. వాటి గురించి గతంలో వైయస్ జగన్ పదేపదే అసెంబ్లీలో మాట్లాడారని గుర్తు చేశారు. తప్పుని పక్కదారి పట్టించడానికి ప్రతిపక్షంపైనే ఆరోపణలు చేశారన్నారు. నేడు హాయ్‌ల్యాండ్ మా ఆస్తి కాదంటూ అగ్రిగోల్డ్ చెప్పడం వెనుక విలువైన హాయ్‌లాండ్‌ను దోచేసే స్కెట్ వేశారని తెలిపారు.దీనిపై చంద్రబాబు కనీసం వివరణకూడా చెప్పలేదని మండిపడ్డారు ఉదయం లేచి పత్రికలు చూస్తే స్కాంలు,దోపిడీలు కనబడుతున్నాయో తప్ప అభివృద్ధి కనబడటం లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీని ఎదుర్కొలేక చంద్రబాబు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ చంద్రబాబుకు బ్రహ్మపదార్థంలాగా కనిపిస్తుందన్నారు.