హైకోర్టు విభజన జరిగితే ఎందుకంతా ఉలిక్కిపాటు..

హైకోర్టు విభజనకు,ప్రతిపక్షానికి సంబంధం ఏమైనా ఉందా..?
చంద్రబాబుపై భూమన ఫైర్‌..
శ్రీకాకుళంఃవిభజన హామీలను అమలు చేయడంలేదని గగ్గొలు పెట్టే చంద్రబాబు..హైకోర్టు విభజన జరిగితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. హైకోర్టు విభజనకు,ప్రతిపక్షానికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు.పది సంవత్సరాలు ఉమ్మడి  రాజధానిగా హైదరాబాద్‌ ఉండవచ్చని విభజన చట్టం చెప్పిందని,ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి..పెట్టె,బెడ సర్ధుకుని అమరావతికి తరలివచ్చారన్నారు.ఐఏఎస్‌ అధికారుల నుంచి సామాన్య ఉద్యోగుల వరుకూ అందర్ని ఇబ్బందులకు గురిచేశారన్నారు. తమ స్వార్థం కోసం చందబాబు రాజధానికి మాకాం మార్చారన్నారు.నేడు హైకోర్టు విషయంలో చంద్రబాబు మాటలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. డిసెంబర్‌ 15లోగా హైకోర్టు భవనం సిద్ధం చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పిన మాట చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారన్నారు.

Back to Top