శ్రీకాకుళంః చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.చంద్రబాబు పాలనపై ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లే దుమ్మెతి పోస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోచ్చన్నారు.ప్రభుత్వం అవినీతిపై ప్రతిపక్షం మాట్లాడితే రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.మరి పాలనలో భాగమైన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మాట్లాడితే ఎందుకు సమాధానం చెప్పడంలేదంటూ ప్రశ్నించారు.చంద్రబాబు పాలనంతా అవినీతిమయమని మొదటి నుంచి చెబుతున్నామన్నారు.సుమారు 3లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిందన్నారు.ఒక నీటిపారుదల ప్రాజెక్టులోనే రూ.20వేల కోట్ల రూపాయాలు టీడీపీ నేతలు మింగేశారన్నారు.విశాఖ భూములు, అమరావతి భూములు, ఇసుకదోపిడీ వంటి అక్రమాలు జరిగాయన్నారు. ప్రభుత్వ పాలనా పనుల్లో కమీషన్ల కక్కుర్తి తప్ప అభివృద్ధి లేదన్నారు.చంద్రబాబు అవినీతిపై మచ్చలేని, నిజాయితీ పరులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారం మాట్లాడటం ప్రజలందరూ గమనించాలన్నారు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని ఆలోచనతో వారు అవినీతి,అక్రమాలపై గళం విప్పుతున్నారన్నారు.