<strong>ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి డ్రామా</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి</strong>విజయనగరంః చంద్రబాబు యువతను, నిరుద్యోగులను వంచించారని 2.12 లక్షల ఉద్యోగాలను భర్తీచేయకుండా దగా చేశారని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు డ్రామా కోసం నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నారని చెప్పారు. నెలకు రూ.2వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి వెయ్యికి కోతపెట్టారని, 50లక్షల మంది లబ్ధిదారులను 10 లక్షలకు కుదించారన్నారు..బాబును నమ్మి నట్టేట మునిగిన నిరుద్యోగులు జగన్‌పై నమ్మకం పెట్టుకున్నారన్నారు. పాదయాత్రలో పెద్దఎత్తున యువత భాగస్వాములు అవుతున్నారని తెలిపారు.