బాబు పాలనలో దేవుడికే దిక్కు లేదు

తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వంలో దేవుడికే దిక్కు లేదని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్వామి వారి నగలు, దుర్గమ్మ చీరెలు, మల్లన్న మణిమాణిక్యాలు పచ్చ రాబందుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు.  తాము చేసిన నిలువు దోపిడీ, కానుకల వల్ల స్వామి వారు ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఉన్నారన్నారు. రుషులు, దేవతలు అందరూ కూడా స్వామి వారి ముందు వినమ్రతతో భక్తిప్రపర్తులను చాటుకుంటున్నారని చరిత్ర చెబుతుందన్నారు. కానీ చంద్రబాబు పాలనలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి అపచారం జరుగుతుందని, అప్రతిష్ట తెస్తున్నారని విమర్శించారు.  16వ శతాబ్ధంతో శ్రీకృష్ణ దేవరాయులు ఇచ్చిన నగలు ఏమయ్యాయని నిన్న కేంద్ర కమిషనర్‌ ప్రశ్నించారని చెప్పారు. 
Back to Top