2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ గెలుపు తథ్యమని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. వైయస్ జగన్ నాయకత్వాన్ని బలపరిచేందుకు వివిధ పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారన్నారు. అనంతపురం అర్బన్ ఏడవ డివిజన్ వార్డు మెంబర్, బలిజ సామాజిక వర్గ నేత యోగి రాయల్ తన అనుచరులతో కలిసి అనంతవెంకట్రామిరెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ సీపీ గెలుపుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు.