చంద్రబాబుకు నైతిక విలువలు లేవు

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు నైతిక విలువలు లేవని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. నవంబర్‌ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోకపోవడం బాధాకరమన్నారు.  సందర్భంగా ఈ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఇవాళ చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని పదే పదే చెప్పిన చంద్రబాబు ఇవాళ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లాడంటే దేనికి సంకేతమని ప్రశ్నించారు. చంద్రబాబు జీవిత చరిత్ర అంతా కూడా వెన్నుపొటు రాజకీయాలే అని విమర్శించారు. 
 
Back to Top