కమీషన్లు దండుకోవడానికే..!

సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబుకు ప్రేమలేదు..
నదుల అనుసంధానం పేరుతో కొత్త డ్రామా...
వర్షాకాలంలో పుట్టగొడుగు పార్టీ జనసేన
వైయస్‌ఆర్‌ను,జగన్‌ను విమర్శించే స్థాయి పవన్‌కు లేదు..
విజయవాడః సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబుకు ప్రేమలేదని,గోదావరి–పెన్నా నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు డ్రామా లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కేవలం ఎన్నికల సమయంలో  చంద్రబాబు చేస్తున్న ప్రచార్భాటంగా పేర్కొన్నారు. 2003లో చంద్రబాబు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  తెలంగాణ దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, 2004లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేది నేనే అని ప్రజల్ని నమ్మించడానికి ఎత్తుగడ వేశారని గుర్తు చేశారు.అదే తంతులో భాగంగా నేడు  మరో డ్రామాకు తెరతీశారని విమర్శించారు. 9.61 లక్షల ఎకరాలకు నీరు అందించి సాగు చేసుకోవడానికి సుగమం చేశామని,మొదటి దశ ప్రాజెక్టుగా నిర్మాణం చేస్తున్నామని, దీనికి ఆరువేల 20వేల కోట్ల రూపాయాలు ఖర్చువుతుందని, టెండర్లు పిలిచి.. అడ్వాన్స్‌లు ఇచ్చి, కమీషన్లు దండుకోవడం తప్ప అనుసంధానం మీద చిత్తశుద్ధి లేదన్నారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఎక్కడలేనివి గుర్తుకు వస్తాయన్నారు.

చంద్రబాబు పరిపాలన ప్రారంభించినప్పుడు చేయవలసిన పనులను పరిపాలన అంతం అయ్యే నాటికి గుర్తుకువస్తాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో సుజల సవ్రంతి, అన్నా క్యాంటిన్లు, నిరుద్యోగ భృతి .ఆశావర్కర్ల జీతాలు పెంపు, బాలికలకు సైకిళ్లు పంపిణీ, గార్డులకు జీతాలు పెంపు, డీఎస్సీ నోటిఫికేషన్, దళితులకు ఉచిత కరెంటు వంటివి ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు గుర్తుకు వస్తాయన్నారు. గు్రరానికి పచ్చగడ్డి కట్టి పెరిగెత్తు అన్న చందాగా  చంద్రబాబు తీరు ఉందన్నారు.పట్టిసీమ నుంచి రాయలసీమ వరుకు నీరు అందిస్తామన్న చంద్రబాబు దోచుకున్నారే తప్ప నీరు అంద చేయలేదన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పిన చంద్రబాబు నేడు పోలవరం ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలన్నారు  పోలవరం ఏ దశలో ఉందని ప్రశ్నించారు. డబ్బులు దోచుకున్నారే తప్ప పోలవరం నిర్మాణంపై శ్రద్ధ పెట్టలేదన్నారు. నిత్యం బస్సులపై,ట్రాక్టర్లపై ప్రజల్ని పంపి పబ్లిసిటీ చేయడమే తప్ప పోలవరం ముందుకు కదలడం లేదన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే ఆలోచనే తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. చంద్రబాబు కోసం పుట్టిన కవలపిల్లల పార్టీల్లో లోక్‌సత్తా పార్టీ ఒకటని,  చంద్రబాబు అధికారంలో ఉండగా లోక్‌సత్తాకు నోరు రాదన్నారు. 

ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్, పార్టీ ఫిరాయింపులు,దోపిడీ,రాజ్యాంగ వ్యవస్థలను మంటగలుపుతున్న తీరుపై ఎప్పుడైనా లోక్‌ సత్తా గొంతెత్తి ప్రశ్నించిందా అని అన్నారు. రెండో కవలపిల్ల  పవన్‌కల్యాణ్‌ అని, చంద్రబాబు మీద మాట్లాడటం మానేసిన పవన్‌ కల్యాణ్‌ జగన్‌పై విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రతి మనిషికి, రాజకీయ పార్టీకి పరీక్ష సమయాలు వస్తాయని . ఆ పరీక్షలకు తట్టుకుని  ధైర్యం నిలబడినప్పుడే ఆ మనిషి స్వభావం అర్థమవుతోందన్నారు. వైయస్‌ జగన్‌ను కూడా అణిచివేయడానికి ఎన్నో కుట్రలు చేశారని, జైలులో పెట్టించారని గుండె ధైర్యంతో ఎదుర్కొన్న  వైయస్‌ జగన్‌ను  పిరికివాడు, పారిపోయాడు అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రజారాజ్యంలో పవన్‌కల్యాణ్‌ భాగస్వామిగా ఉన్నారని, పరీక్ష సమయంలో పవన్‌ ఏం చేశారన్నారు.. పార్టీని నడపగలిగరా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ను విమర్శించే  స్థాయి పవన్‌కల్యాణ్‌కు లేదన్నారు.

వర్షాకాలంలో పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చే పార్టీల కోవకు చెందిందే జనసేనా పార్టీ అని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ సంస్కారం లేకుండా ఆవేశంగా మాట్లాడుతున్నారన్నారు.రాజ్యాంగం చదువుకోలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటుంటే పవన్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. «ధైర్యమే వైయస్‌ఆర్‌సీపీ ఆయుధం అని ఓటమిని కూడా స్వీకరించి ఎదుర్కొనే పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని అన్నారు. చంద్రబాబును రక్షించడంలో పుట్టిన కవలపిల్లలో మీరు కూడా ఒకరు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని అన్నారు. ప్రజలు  చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ డ్రామాలను అర్థంచేసుకుంటున్నారని,  ప్రజలు క్షమించరని ఓటుతో బుద్ధి చెబుతారన్నారు.

Back to Top