ఫిబ్రవరిలో ఓటుకు కోట్లు కేసు విచారిస్తామన్న సుప్రీం కోర్టుఇన్నాళ్లు చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేస్తూ వచ్చాడుపగలు సోనియా, రాహుల్ కాళ్లు పట్టుకుంటూ.. రాత్రి వ్యవస్థల మేనేజ్కోర్టు తీర్పును వైయస్‌ఆర్ సీపీ స్వాగతిస్తుంది
ఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దోషి అని న్యాయస్థానం తేల్చే రోజులు దగ్గరపడ్డాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన తన బుద్ధిని ప్రదర్శించి పగలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కాళ్లు పట్టుకొని, రాత్రి ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడన్నారు. ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి ఫిబ్రవరిలో కేసు విచారణ జరుపుతామని చెప్పిన గౌరవ సుప్రీం కోర్టు సాక్షాధారాలన్నీ పరిశీలించి చంద్రబాబు ముమ్మాటికీ దోషి అని తీర్పు వెల్లడిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. సుప్రీం కోర్టు ఆవరణలో ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. 2017 డిసెంబర్‌లో ఎర్లీ హియరింగ్ పిటీషన్ దాఖలు చేశామని, 2017 మార్చి 6 నుంచి 2018 మార్చి 6వ తేదీ లోపు మెయిన్ కేసును వినాలనే సంప్రదాయం కొనసాగుతుందన్నారు. కొంత మంది పెద్దలు కేసును నీరుగారుస్తూ బెంచి మీదకు కూడా రానివ్వడం లేదన్నారు. ఎర్లీ హియరింగ్ పిటీషన్ 2017 డిసెంబర్‌లో వేస్తే సహజంగా అలవ్ అయింది. 15 రోజుల లోపు పరిగణలోకి తీసుకోవాలని, కానీ చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పిటీషన్ విచారణకు రానివ్వలేదన్నారు.
2017 డిసెంబర్ 15 నుంచి సుప్రీం కోర్టుకు సెలవులు రాక ముందు నుంచి ఓటుకు కోట్ల కేసు లిస్టింగ్ అవుతుందని, కానీ బెంచి మీదకు రానివ్వడం లేదన్నారు. చంద్రబాబు నీతి, న్యాయాన్ని కూడా కొనుగోలు చేసే స్థితికి దిగజారాడన్నారు. చంద్రబాబు దుర్మార్గాలను ఎండగట్టేందుకు తగిన సాక్షాధారాలతో వచ్చామని గౌరవ న్యాయస్థానాన్ని కోరడంతో కేసు విచారణకు వచ్చిందన్నారు. సుప్రీం కోర్టు ఫిబ్రవరి నెలలో మొత్తం కేసును తెలంగాణ ఏసీబీ నుంచి తప్పించి సీబీఐకి అప్పగించాలనే పిటీషన్‌ను వింటామని తీర్పు ఇచ్చిందన్నారు. తిరిగి చంద్రబాబు తరుపున న్యాయవాది ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అని రాజకీయ కక్షతో చేస్తున్నారని వాదించినా వాటన్నింటినీ కోర్టు తోసిపుచ్చిందన్నారు. ఫిబ్రవరి నెలలో కేసును వింటామని సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.