వైయస్సార్సీపీ ఉద్యోగ పోరు

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బాబు తూట్లు
  • ఉద్యోగాలు కల్పించాలని వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన
  • కాకినాడ కలెక్టరేట్ వద్ద  ఉద్యోగ పోరు కార్యక్రమం
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
తూర్పు గోదావరి జిల్లాః కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వైయస్సార్ సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో ఉద్యోగ పోరు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ,రాష్ర్ట యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా ,రాష్ర్ట విద్యార్ది  విభాగం అధ్యక్షులు సలాం బాబు ,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంత బాబు ,టౌన్ కన్వీనర్ ప్రుటీ కుమార్ , వివిధ నియోజక వర్గాల కోఆర్డినేటర్స్, పార్టీ  యువజన విభాగ రాష్ర్ట ,జిల్లా కమిటీ నాయుకులు పాల్గొన్నారు. 

2014 ఎలక్షన్ ప్రచారంలో ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి బాబు మోసం చేశారని యువనాయకులు మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావాలటూ టీవీ లలో ప్రకటనలతో ఊదరగొట్టడంతో  పేదప్రజలు ఆశతో చంద్రబాబును గద్దెనెక్కించారని, ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా  త్వరితగతిన  హామీలు అమలు జరపాలని వైయస్సార్ కాంగ్రెస్స్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. 
Back to Top