వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేని పాపిష్టి సీఎం బాబు

  • బెయిల్‌ రద్దు అంటూ అనుకూల మీడియాలతో హైడ్రామా
  • బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటీషన్‌ను కొట్టేసిన కోర్టు
  • సోనియా, చంద్రబాబు కుట్రల కేసుల్లోంచి వైయస్‌ జగన్‌ కడిగిన ముత్యంలా వస్తారు
  • చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉంటే వెంటనే రాజీనామా చేయాలి
  • సీఎంఎస్‌ సర్వేలో ఏపీది అవినీతిలో 2వ స్థానం
  • 20 ఏళ్లు కాదు.. 20 నిమిషాలు కూడా సీఎంగా చంద్రబాబు అనర్హుడు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

  • హైదరాబాద్‌: ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే దమ్ములేని పాపిష్టి సీఎం చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు అంటూ పనిగట్టుకొని కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బెయిల్‌ రద్దు ప్రసారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం పరిపూర్ణంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించింది చాలక ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చంద్రబాబు, కొన్ని మీడియా ఛానళ్లు వ్యవహరిస్తున్నాయని భూమన విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైయస్‌ జగన్‌ లోటస్‌పాండ్‌ నివాసం నుంచి బయల్దేరినప్పటి నుంచి కొన్ని న్యూస్‌ ఛానల్స్‌ వాహనాలు వెంబడించి వైయస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు కాబోతుంది.. రద్దు అయినట్లుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటీషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టేసిందని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో వైయస్‌ జగన్‌ను నిలవరించే శక్తిలేక ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రసార మాధ్యమాలను బెదిరించి, లొంగదీసుకొని బెయిల్‌కు సంబంధించి కథనాలు అల్లించి, నిరంతరం ఇదే అంశంపై తన నాయకులతో మాట్లాడించే ప్రయత్నాలు చంద్రబాబు చేశారని దుయ్యబట్టారు.

    వైయస్‌ జగన్‌ అంటే బాబుకు ఎంత భయమో
    ఎన్డీయే ప్రభుత్వంలో సీబీఐ సరిగ్గా పనిచేయడం లేదని టీడీపీ నేతలు అనడంతో సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి వైయస్‌ జగన్‌పై అక్రమంగా కేసులు బనాయించారనే నిజం బహిర్గతమైందని భూమన అన్నారు. సోనియాగాంధీతో చేతులు కలిసి వైయస్‌ జగన్‌ను జైలుకు పంపగలిగాం అనే అర్థం వచ్చే రీతిలో నిసిగ్గుగా టీడీపీలు పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ఢిల్లీకి వెళితే.. బెయిల్‌ రద్దు భయంతోనే వెళ్లారని ఓ మంత్రి, బెయిల్‌ రద్దు కాక తప్పదని సాక్షాత్తు చంద్రబాబే మాట్లాడుతున్నారంటే సరైన పాలన అందించలేక ఒక బలమైన ధీశాలి, సమస్యలపై ప్రతిఘటించడంలో నిరంతరం వెనుకాడని శక్తిసామర్థ్యుడు వైయస్‌ జగన్‌ అంటే ఎంత భయమో అర్థమవుతుందన్నారు. బెయిల్‌ రద్దు పిటీషన్‌ ఏ విధంగానైతే కొట్టివేయబడిందో ఏ తప్పు చేయని వైయస్‌ జగన్‌ మీద తీర్పు కూడా సానుకూలంగా వస్తుందనే ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. సోనియా, చంద్రబాబులు అక్రమంగా వైయస్‌ జగన్‌పై బనాయించిన కేసుల్లోంచి కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తారని, న్యాయస్థానం తీర్పులపై మా పార్టీకి ప్రగాఢ విశ్వాసం ఉందని పురుద్ఘాటించారు. నిజం ఎప్పటికీ దాగదని చంద్రబాబును హెచ్చరించారు.

    సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి
    చంద్రబాబుకు సిగ్గు, ఎగ్గు, లజ్జ ఉంటే సీఎంఎస్‌ రిపోర్టు చూసైనా పాలనకు అర్హుడిని కాదని తక్షణమే రాజీనామా చేయాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 2016లో ఎన్‌సీఏఆర్‌టీ సంస్థ దేశంలోనే అత్యంత అవినీతికరమైన ప్రభుత్వంగా చంద్రబాబును గుర్తించిందన్నారు. అదే విధంగా సీఎంఎస్‌ అనే సంస్థ కూడా తన సర్వే రిపోర్టులో దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్‌ను 2వ స్థానంలో నిలబెట్టిందన్నారు. ఇలా వాస్తవాలుంటే చంద్రబాబు మరో 20 ఏళ్లు మావేనని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. ఇంత అవినీతి చేసిన తరువాత 20 ఏళ్లు కాదు కదా.. 20 నిమిషాలు కూడా సీఎంగా కొనసాగడానికి చంద్రబాబు అర్హత లేదన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మళ్లీ 20 ఏళ్లు అంటున్నారంటే.. ప్రతీరోజు సంపాదిస్తున్న వేల లక్షల కోట్ల రూపాయలను ఎన్నికల్లో కుమ్మరించి మదబలం, అధికారబలం, మోసాలతో గెలవాలని ఆలోచనే తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడేది ప్రతీది అబద్దమేనని భూమన పేర్కొన్నారు. కియా అనే మోటార్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని రెండు మిలియన్లతో పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. కానీ కియా కంపెనీ మాత్రం ఒక మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నామని ప్రకటన చేసిందన్నారు. చంద్రబాబు ప్రతీదాన్ని హైప్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మోసకారి ప్రతిజ్ఞలు చేసే చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజల సమక్షంలో నేను పాలనకు అనర్హుడినని స్వచ్ఛమైన ప్రతిజ్ఞ చేసి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు.
Back to Top