హోదా కోసం వైయస్‌ఆర్‌ సీపీ పోరుబాట

కలెక్టరేట్‌లను ముట్టడించిన వైయస్‌ఆర్‌ సీపీ నేతలు
ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్ర అభివృద్ధి
ధర్నాను అణచివేసేందుకు చంద్రబాబు సర్కార్‌ కుట్ర
అమరావతి: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట పట్టింది. హోదా సాధిస్తేనే ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. జిల్లాల్లోని కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ప్రత్యేక హోదా సాధన ధర్నాలో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఆయా ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగేళ్లుగా నిర్విరామంగా పోరాడుతుంది. వైయస్‌ జగన్‌ ధర్నాలు, దీక్షలు, ఆమరణ దీక్షలు, రాస్తారోకోలు, యువభేరీలు చేపట్టిన ప్రత్యేక హోదా అవశ్యకతను యువతకు, ప్రజలకు వివరించారు.
ఉద్యమ నుంచి వెనకడుగు వేయం..
మొదటి నుంచి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగారుస్తున్న చంద్రబాబు సర్కార్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్నాను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతుంది. పోలీసులను చేతిలో పెట్టుకొని ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తుంది. కలెక్టర్‌ల ముట్టడికి ముందుగా అనుమతి కోరినా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఉద్యమం నుంచి వెనకడుగు వేయమని వైయస్‌ఆర్‌ సీపీ స్పష్టం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ధర్నాకు కమ్యునిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. 
 
Back to Top