రైతులు సంక్షోభంలో ఉంటే... డిగ్రీ పట్టాలు ఇస్తావా..

చంద్రబాబు అవాస్తవ ప్రచారాలపై మేధావులు, శాస్త్రవేత్తల మౌనం ప్రమాదకరం..
వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి 
విజయవాడః రాష్ట్రంలో పెద్దఎత్తున్న ప్రకృతి వ్యవసాయం జరుగుతుందని టీడీపీ ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేసి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని దారి మళ్లీంచడానికి ప్రయత్నాలు చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుంచే ఉందని, పాలేకర్‌ అనే వ్యక్తి సుమారు 20 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. గతంలో కూడా విజయవాడలో ప్రైవేట్‌ స్పానర్స్‌ ద్వారా పాలేకర్‌ క్లాసులు నిర్వహించారని తెలిపారు. కాని  ప్రకృతి వ్యవసాయం నేనే చేశానని చంద్రబాబు చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. 2024 నాటికి రెండు కోట్ల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తాం,ఎగుమతులకు రాయితీలు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని, 88 శాతం రైతులు ప్రకృతి సేద్యం మూలంగా ఖర్చులు తగ్గి  ఉత్పత్తి లాభం పెరిగిపోయినట్లుగా చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికి కూడా 5 లక్షల 83వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, 5 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారని చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారన్నారు.

ఒక వ్యవసాయ శాఖను, ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్‌ చేస్తున్నామని,  ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా 5 లక్షల 83 వేల మంది లిస్టును రైతు సంఘాలకు ఇవ్వండి.. ఆదాయం ఎక్కడ వస్తుందో చూపిస్తే  రైతు నాయకులుగా రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. అవాస్తవాలను ప్రచారం చేసి రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభాన్ని దారిమళ్లీంచడానికి పెద్దఎత్తున్న ప్రచారం జరుగుతుందన్నారు. పాలేకర్‌  సొంతమండలంలో ఎంత ప్రకృతి సేద్యం జరుగుతుందని ప్రశ్నించారు. ఒక ఎకరం కోత కోయడానికి రూ.3,500, ఒక ఎకరం కుప్ప వేయడానికి 4 వేలు,కుప్ప నూర్చడానికి 4 వేల రూపాయలు, నారు తీసి నాట్లు వేయడానికి 2,500 రూపాయలు, కలుపులకు చిన్న చిన్న పనులకు ఎకరానికి 1000 నుంచి 15 వందల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఎరువులు,పురుగుల మందులు కాకుండానే రూ.25వేలు పెట్టుబడి కావాలన్నారు.ప్రకృతి వ్యవసాయంలో  కేవలం, పురుగుల మందులు, రసాయన ఎరువుల ద్వారా అయ్యే 4వేల రూపాయాలు ఖర్చు తగ్గుతుందన్నారు. 5 లక్షల 83వేల మంది రైతులు, 5లక్షల 83వేల నాటు ఆవులను పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారని చెబుతున్నారని.ఒక నాటు ఆవు కొనుగోలుకు పోషణకు ఎంత ఖర్చు అవుందన్నారు. ఒక  ఆవును పోషించాలంటే ఒక ఎకరం వరిగడ్డి కావాలి.

మార్కెట్‌లో ఎకరం వరిగడ్డి పదివేల రూపాయాలు ఉందన్నారు. జీవామృతం తయారుచేయాలంటే పప్పుధాన్యాల పిండి, బెల్లం దాంట్లో కలపాలన్నారు. ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడున్న వ్యయం కంటే ఎక్కువ అవుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో దిగుమతులు పెరుగుతాయనేది పచ్చి అబద్ధం అని అన్నారు. మొదట వ్యవపసాయం విశ్వవిద్యాలయాల్లో ప్రయోగాత్మకంగా నిరూపించి లాభాలను జమచేసి అప్పుడు ప్రజలు చెప్పాలన్నారు.రైతులను ప్రభుత్వం పిచ్చివాళ్లులాగా భావిస్తుందన్నారు. 8 నుంచి సంవత్సరాలకు పాలేకర్‌ విధానంలో వ్యవసాయం చేస్తున్నానని, 1 నుంచి 5 ఎకరాలకు పెంచానని చివరికి 1 ఎకరానికే పరిమితమయ్యానని తెలిపారు. ఎరువులు,రసాయనాలు లేకుండా  కేవలం క్వాలీటి మెటిరియల్‌ మాత్రమే వస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు గ్రాడ్యుయేషన్‌ పట్టాలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు.  

డిగ్రీ ఇవ్వాలంటే అకాడమి కౌన్సిల్,ఒక విశ్వవిద్యాలయం ఉండాలి.ఐసిఆర్‌ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇవ్వాలన్నారు. ఉత్పత్తులకు ధరలు లేకుండా కుప్పకూలిపోయి రైతాంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోతే ప్రకృతి సేద్యం ఎగుమతులకు రాయితీలు ఇస్తామంటు ప్రకటనలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవ శాస్త్రంలో లో ఓనమాలు తెలియని ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మేధావులు, శాస్త్రవేత్తలు మౌన వహించడం ప్రమాదకరమన్నారు. ఖండించకపోతే భవిష్యత్‌ తరాలు క్షమించవన్నారు. వాస్తవానికి విరుద్ధంగా చేసే ప్రచారాలు కేవలం తాత్కాలికమన్నారు.ప్రభుత్వ డబ్బులు వ్యయంతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top