చంద్రబాబు వంచనకు గుణపాఠం.. తెలంగాణ తీర్పు...

రేపు ఏపీలో కూడా బాబుకు ఇదే గతి...
ఢిల్లీః నేడు తెలంగాణలో తీర్పు కన్నా దారుణంగా రేపు ఏపీలో ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బీజేపీతో కలిసి  నాలుగున్నర సంవత్సరాలు కాపురం చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఏపీని అడ్డగోలు విభజించిన  కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. ప్రజా స్వామ్యాన్ని రక్షించడం కోసం కాదు ఆయన్ని రక్షించుకోవడం కోసం, దోచుకున్న సొమ్మును కాపాడుకోవడం కోసం కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు పెట్టుకున్నారన్నారు.  నేడు తెలంగాణ ఫలితాలతో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుందో కాంగ్రెస్‌కు తెలిసివచ్చిందన్నారు ఏపీలో కూడా చంద్రబాబును ఎప్పుడు బంగాళాఖాతంలో కలిపేద్దామా అని ప్రజలు ఉన్నారని,ఏపీ ఎన్నికల్లో  చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
 
Back to Top