<br/>హైదరాబాద్: వైయస్ జగన్‌కు భద్రత పెంచాలని వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండు చేశారు. ఎయిర్‌పోర్టులో వైయస్ జగన్ పై దాడి జరిగితే మాకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. గతంలో ప్రత్యేక హోదా సాధనలో భాగంగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన వైయస్ జగన్‌ను బయటకు రాకుండా రన్‌వే పై అడ్డుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. వైయస్ జగన్‌పై ఫలాన కులం వ్యక్తి దాడి చేశారని చెప్పడం బాధాకరమన్నారు. దాడి చేసిన వ్యక్తి వైయస్‌ఆర్‌సీపీ అభిమాని అని చెప్పడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎక్కడా కూడా మేం ఈ దాడిని రాజకీయంగా వాడుకోవడం లేదని, దయచేసి వైయస్ జగన్‌కు భద్రత పెంచాలని మిథున్‌రెడ్డి డిమాండు చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. <br/> –ఎయిర్ పోర్టులో సెల్ఫీ పేరుతో వచ్చి జగన్ గారిపై దాడి చేసి పొడిచాడు.–ఇదే కత్తి మెడకు తగిలిఉంటే ఏమైఉండేది.–సిసిటివి ఫుటేజ్ అడిగితే లేదని చెబుతున్నారు.–అలాంటి కత్తులు ఎయిర్ పోర్టులో భధ్రత ఉన్నా ఎలా తీసుకువచ్చారనేది అర్దం కావడంలేదు.–ఎయిర్ పోర్టు లోపల జరిగింది తమకు సంభందం లేదని రాష్ట్రమంత్రులు చెప్పడం నీచం.–ఈ సంఘటనను ఎక్కడా కూడా మేం రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం లేదు.–జగన్ మోహన్ రెడ్డిగారికి భధ్రత పెంచండి.–రాజకీయాలకు పక్కనపెట్టి మనం మనుషులం అనే విషయం గుర్తుంచుకోండి.–జగన్ మోహన్ రెడ్డిగారికి మధ్దతు తెలియచేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నాం.–భధ్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోకుండా రాజMీ యంగా మాట్లాడటం బాగాలేదు.–ఇటీవల భద్రతా వైఫల్యం వల్ల ఎంఎల్ ఏను పొగొట్టుకున్నాం.–క్యాంటిన్ లో పనిచేసే వ్యక్తి ఇలా చేస్తే రేపు జగన్ గారి పాదయాత్ర చేస్తుంటే ఏం జరుగుతుందా అనే విధమైన పరిస్దితి ఏర్పడింది.–రాష్ట్రంలో ఇంత నీచమైన రాజకీయాలు నెలకొనడం దారుణం.–జగన్ మోహన్ రెడ్డి బలమైన ధైర్యం ఉన్న వ్యక్తి.ఇలాంటి వాటిని పట్టించుకునే వ్యక్తి కాదు.అందుకే హైద్రాబాద్ బయల్దేరి వచ్చారు.