హోరెత్తిన హోదా నినాదం

- ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట‌
- రాష్ట్రంలోని అన్ని క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ధ‌ర్నాలు
 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ రోజు (మార్చి 1) అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్ర‌త్యేక హోదా నినాదాల‌తో క‌లెక్ట‌రేట్లు ద‌ద్ద‌రిల్లుతున్నాయి. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు. హోదా సాధన కోసం దశల వారీగా ఆందోళనను మరింత ఉధృతం చేయాలని వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరుగుతున్న ధర్నాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా పాల్గొంటున్నారు. వైయ‌స్‌ జగన్‌ విడిది చేసిన ప్రజాసంకల్పయాత్ర శిబిరం నుంచే ధర్నా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

 
ప్రకాశం.. 
ప్రత్యేక హోదాపై ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో బాలినేని శ్రీనివాస రెడ్డి, మర్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకట్‌ రెడ్డి, పలువురు నేతలు, ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 
శ్రీకాకుళం..
రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాపై వైయ‌స్‌ఆర్‌సీపీ పోరుబాట పట్టింది. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్‌ వద్ద వైయ‌స్‌ఆర్‌సీపీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో  వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు దర్మాన ప్రసాద్‌ రావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యే కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కుమార్‌, సీదిరి అప్పలరాజు, నర్తు రామరావు, పేరాట తిలక్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

 
చిత్తూరు..
ప్రత్యేక హోదాపై రాష్ట్రాప్రజానీకం కదంతొక్కింది. జిల్లాలో కలెక్టరేట్‌ వద్ద వైయ‌స్‌ఆర్‌సీపీ  ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిప్పేస్వామి, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 
క‌ర్నూలు..
ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన క‌లెక్ట‌రేట్ ముట్ట‌డికి అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజ‌రు కావ‌డంతో క‌ర్నూలు క‌లెక్ట‌రేట్ నినాదాల‌తో హోరెత్తింది. పార్టీ నాయ‌కులు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, బీవై రామ‌య్య‌, గౌరు వెంక‌ట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఐజ‌య్య‌, గౌరు చ‌రితారెడ్డి, సాయిప్ర‌సాద్‌రెడ్డి, బాల‌నాగిరెడ్డి, గుమ్మ‌నూరు జ‌యరాం, అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు పాల్గొని ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని నిన‌దించారు. అంత‌కుముందు పార్టీ కార్యాల‌యం నుంచి క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు..
కలెక్టరేట్‌ వద్ద  వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 
అనంతపురం..
వైయ‌స్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వరంలో అనంతపురంలో బైక్‌ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు శంకర్‌ నారాయణలు ప్రారంభించారు. బైక్‌ ర్యాలీలో హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదాలు చేస్తూ కార్యకర్తలు ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్‌నారాయణ, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి,  పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.

 
వైయ‌స్ఆర్‌ జిల్లా..
ప్రత్యేక హోదా కోసం కడప జడ్పీ కార్యాలయం వద్ద వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్నాకు దిగింది. ఈ ధర్నాకు మద్దతుగా 10 నియోజక వర్గాల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేష్‌ బాబు, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌ రెడ్డి, శ్రీనివాసులు,  అంజాద్‌ బాషా, రాచమల్లు ప్రసాద్‌ రెడ్డిలు పాల్గొన్నారు. 
 
పశ్చిమగోదావరిలో మహాధర్నా..
జిల్లాలోని ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ప్రత్యేక హోదా కోసం వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఏలూరు, నరసాపురం పార్లమెంట్‌ అధ్యక్షులు ఆళ్ల నాని, ముదునూరి ప్రసాద్‌ రాజుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ మహాధర్నాకు నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రత్యేక హోదా కోసం ధర్నాకు మద్దతుగా పెద్దాపురం కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

 
విశాఖపట్నం..
ప్రత్యేక హోదా కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జీవీఎంసీ వద్దకు  ధర్నా వేదికను మార్చారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

తాజా ఫోటోలు

Back to Top