వైయస్సార్సీపీ ధర్నా విజయవంతం

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కార్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైయస్సార్సీపీ చేపట్టిన ధర్నా విజయవంతం అయ్యింది. వైయస్సార్సీపీ శ్రేణులు, ఆరోగ్యశ్రీ బాధితులు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని కోరుతూ కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చారు.

Back to Top