కాగ్ రిపోర్టుపై చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి


అమరావతి : కాగ్‌ రిపోర్టుపై  చంద్రబాబు స‌మాధానం చెప్పాల‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ డిమాండు చేశారు. 
కాగ్‌ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, కాగ్‌ రిపోర్ట్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయ‌న పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లిస్తున్నారని, తెలుగు తమ్ముళ్లకు ఉపయోగపడే పథకాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని మండిప‌డ్డారు.  బియ్యం సరఫరాలో కుంభకోణం జరిగిందన్న కాగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ విచారణకు ఆదేశించిన తరహాలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంటే చంద్రబాబు విదేశీ పర్యటనలు, భాగస్వామ్య సదస్సుల పేరుతో వృథా ఖర్చులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాల తీసేలా ప్రభుత్వం వ్యవరిస్తోందని, కాగ్‌  నివేదికల ద్వారా అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయన్నారు. 
తాజా వీడియోలు

Back to Top