హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న పలు నగరపాలక, పురపాలక సంస్థలకు వైఎస్సార్‌సీపీ.. ఎన్నికల పరిశీలకులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు కార్పొరేషన్‌కు పార్టీ ఎంపీలు ైవె వీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, షేక్ మహ్మద్ ముస్తఫా, సామినేని ఉదయభాను, లేళ్ల అప్పిరెడ్డి, ఒంగోలుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, తిరుపతికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, కర్నూలుకు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, కాకినాడకు మాజీ మంత్రి కొలుసు పార్థసార థి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పేర్ని నాని, చలమశెట్టి సునీల్, విశాఖపట్నానికి వి.విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎన్నికల పరిశీలకులుగా నియమించారు.<br/>ఇక మున్సిపాలిటీలకు పరిశీలకుల విషయానికొస్తే శ్రీకాకుళంకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు, రాజాంకు ఎమ్మెల్యే కంబాల జోగులు, ఆర్వీఎస్‌కెకె రంగారావు (బేబి నాయన), నెల్లిమర్లకు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ సురేష్, అనపర్తికి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, కందుకూరుకు ఎమ్మెల్యేలు పోతుల రామారావు, కాకాని గోవర్థన్‌రెడ్డి, రాజంపేటకు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.సురేష్‌బాబు (మేయర్) నియమితులయ్యారు. పరిశీలకులుగా నియమితులైన వారు అభ్యర్థుల ఎంపిక మొదలు, పార్టీ ప్రచార వ్యూహాలను, ఎన్నికలను పర్యవేక్షిస్తారు