వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్‌పై టీడీపీ వర్గీయుల దాడి

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ సుబ్బరాయుడిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. నంద్యాలకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్‌పై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన విపక్ష కౌన్సిలర్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో కౌన్సిలర్‌ సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 
 
Back to Top