<strong><br/></strong><strong>అరెస్ట్ చేసేవరకు పోరాటం ఆగదు</strong><strong>విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన వైయస్‌ఆర్ సీపీ మహిళా కార్పొరేటర్లు</strong>విజయవాడ: ఎమ్మెల్యే రోజాపై నోరుపారేసుకున్న కమీడియన్ బండ్ల గణేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మండిపడింది. ఈ మేరకు విజయవాడ కమిషనర్ కార్యాలయంలో బండ్ల గణేష్‌పై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుణ్యశీల మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద అసభ్య పదజాలాన్ని నమోదు చేస్తూ కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. బండ్ల గణేష్‌ను అరెస్టు చేసేవరకు పోరాటం ఆగదన్నారు. కమీడియన్ గణేష్‌కు నిజంగా దమ్మూ, ధైర్యం ఉండి అదే స్టాండ్‌పై నిలబడి ఉంటే భయపడి ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావని ప్రశ్నించారు. తప్పతాగి మీడియాలో చర్చావేదికలో పాల్గొనడమే తప్పు.. అలాంటిది ఒక మహిళా శాసనసభ్యురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంతకంటే పెద్ద తప్పు అన్నారు. బండ్ల గణేష్ జీవిత చరిత్ర ఎలాంటిదో హీరోయిన మీరాచోప్రా, హీరో సచిన్‌జోషి చెప్పారన్నారు. ముందు నీది చూసుకొని తరువాత ఇతరుల గురించి మాట్లాడితే మంచిదన్నారు.